వేషం మార్చిన జిల్లా కలెక్టర్... అర్ధరాత్రి తనిఖీలు! అసలు విషయం ఏంటంటే?
Fri May 30, 2025 16:05 Others.202505307163.jpg)
అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో హాజరయ్యేందుకు నిన్న(బుధవారం) గుంతకల్ వచ్చారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రొటీన్గా వెళ్తే ఏముంటుంది అనుకున్నారో ఏమో? జిల్లా కలెక్టర్ మారువేషంలో వెళ్లారు. ముఖానికి మాస్క్.. మెడలో కండువా కప్పుకుని గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కలియతిరిగారు. రోగులను అడిగి ఆసుపత్రిలో సౌకర్యాలు, సమస్యలను తెలుసుకున్నారు.
సామాన్యుడిలా ముఖానికి మాస్క్, మెడలో కండువా కప్పుకుని, రబ్బర్ చెప్పులు ఆస్పత్రి బయటే విడిచి లోపలికి వచ్చారు. ఆసుపత్రులో సిబ్బందితో మాట్లాడుతున్నా.. ఎవరు గుర్తుపట్టలేదు. మరుసటి రోజు ఆసుపత్రి సిబ్బంది రొటీన్గా సీసీ ఫుటేజ్ పరిశీలిస్తుంటే, రాత్రి 10 గంటల తర్వాత జిల్లా కలెక్టర్ వచ్చి వెళ్లిన సంగతి తెలుసుకుని ఖంగుతిన్నారు.
ఇది కూడా చదవండి: పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!
సీసీ ఫుటేజ్ చూసే వరకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి తనిఖీ చేసిన విషయం ఆసుపత్రి సిబ్బందికి తెలియదు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మరుసటి రోజు ఉరుకులు, పరుగులు పెట్టారు. ఇంతకీ కలెక్టర్ గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం పరిశీలించారు? రోగులు ఏ సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు? అన్న దానిపై గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆరా తీస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి, 29 మందికి గాయాలు!
కడప గడ్డ.. దేవుని గడప లో మహానాడు 2025 ఘనవిజయం!
మద్యం కుట్రపై కీలక ఆధారాలతో సిట్! ఆరుగురు నిందితులను కస్టడీ!
అన్నదాత సుఖీభవ పథకం.. ఎవరు అర్హులు! ఎలా దరఖాస్తు చేసుకోవాలి!
ఎన్‌టీఆర్ భరోసా పథకం..! 71,380 స్పౌజ్ పింఛన్ల మంజూరు!
జర్నలిస్టులకు సర్కార్ గుడ్‌న్యూస్..! అక్రిడేషన్ కార్డుల గడువు పొడిగింపు!
తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టం...! డ్రోన్ ఎగరేస్తే ఇక అంతే!
ఏపీలో తొలి కరోనా మరణం..? అసలు సంగతి ఏంటో చెప్పిన అధికారులు!
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
ఏపీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ! న్యాయవాది సమక్షంలో..
ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?
ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ! ట్రేడ్ కోర్టు సంచలన తీర్పు!
ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై ఆదివారం కూడా.. వారికి ఇళ్ల వద్దకే సరుకులు!
అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..
మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..
14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడిగా.. విజేతలు వీరే.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AnantapurCollector #VinodKumarIAS #MidnightInspection #SurpriseVisit #GuntakalHospital
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.